News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 24, 2026

భూసేకరణ అడ్డంకులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా చేపట్టిన భూసేకరణకు సంబంధించి దరఖాస్తుల పరిష్కారం పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రావుతో కలిసి సందర్శించి దరఖాస్తుల పరిష్కారం వివరాలను పరిశీలించారు. 63, 163జీ రహదారుల ఏర్పాటులో దరఖాస్తుల పరిష్కార చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

News March 24, 2026

‘టీవీ రహిత సమాజంలో భాగస్వాములు కావాలి’

image

సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి టీబీ రహిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రావీణ్య పిలుపు నిచ్చారు. పోతిరెడ్డిపల్లి సబ్ సెంటర్‌లో 100 రోజుల ‘TB ముక్త్ భారత్ అభియాన్ v2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లాలో టీబీ అధికంగా ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి, ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించినట్లు చెప్పారు.