News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 15, 2026

జనగణన వివరాలు చెప్పకుంటే రూ.1000 ఫైన్

image

తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు తొలిదశ జనగణన జరగనుందని సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి తెలిపారు. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయని, వివరాలు చెప్పకుంటే రూ.1000 ఫైన్ విధిస్తామని వెల్లడించారు. జనగణన ఆధారంగానే ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తాయని, ప్రజలు ఎన్యుమరేటర్లకు పూర్తిగా సహకరించి డీటెయిల్స్ ఇవ్వాలని కోరారు. రెండో దశ సెన్సస్ 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు కొనసాగుతుందని చెప్పారు.

News March 15, 2026

హార్ముజ్‌కు యుద్ధ నౌకలు పంపండి: ట్రంప్

image

హార్ముజ్‌ జలసంధిపై పట్టు సాధించేందుకు US అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ వల్ల ఇబ్బందులు పడుతున్న దేశాలు అమెరికాతో కలిసి యుద్ధ నౌకలను హార్ముజ్‌కు పంపాలని తాజాగా కోరారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, UK తదితర దేశాలు ప్రభావితమయ్యాయని, అవి తమ వార్‌షిప్స్‌ను పంపిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా వందలాది సరకు రవాణా నౌకలు హార్ముజ్‌లో నిలిచిపోవడంతో ప్రపంచం అతలాకుతలం అవుతోంది.

News March 15, 2026

NZB: హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

image

నిజామాబాద్ జిల్లాలోని 340 మంది హజ్ యాత్రికులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు. శనివారం జీజీహెచ్‌‌లో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. అనంతరం ఈ నెల 23న యాత్రికులకు ముందుజాగ్రత్తగా ఇన్ఫ్లుఎంజా, న్యూమోకొకల్ వంటి టీకాలను పంపిణీ చేయనున్నట్లు వివరించారు.