News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 13, 2026

పన్నుల వసూలులో నిర్లక్ష్యం వద్దు: జేసీ

image

​బాపట్ల జిల్లాలో నిర్మాణ రంగ పన్నుల వసూలులో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ శుక్రవారం ఆదేశించారు. కార్మికుల సంక్షేమ నిధికి ఈ పన్నుల ఆదాయమే కీలకమని ఆమె స్పష్టం చేశారు. అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ-శ్రమ పోర్టల్‌లో ఇప్పటివరకు 1.96 లక్షల మంది కార్మికులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు జేసీ వెల్లడించారు.

News March 13, 2026

గ్యాస్ బుక్ చేసే వారికి ఎస్పీ సూచనలు

image

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు SP వకుల్ జిందాల్ సూచించారు. వంటగ్యాస్ సిలెండర్ల కొరత ఉందనే అపోహలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మల్చుకొని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. అదనపు సిలెండర్లు కేటాయిస్తామని బురిడీ కొట్టిస్తున్నారని వివరించారు. అనుమానస్పద లింకులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చెయ్యొద్దని సూచించారు.

News March 13, 2026

జగిత్యాల: ముగిసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు

image

జగిత్యాల జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 30 కేంద్రాల్లో నిర్వహించగా 97.55% హాజరు నమోదైంది. జనరల్ కోర్సుల్లో 5671 మందికి గాను 5571 మంది హాజరై 100 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 546 మందికి గాను 494 మంది హాజరై 52 మంది గైర్హాజరయ్యారు. నేటితో జనరల్ విభాగం పరీక్షలు ముగిశాయి. పరీక్షలు సరిగా రాయకపోయిన వారు మేలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని పరీక్షల కన్వీనర్ నారాయణ తెలిపారు.