News March 29, 2024

NTPCలో యువకుని అనుమానాస్పద మృతి

image

రామగుండం NTPC పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జీ వద్ద దర్శన్ సింగ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నిన్న మధ్యాహ్నం లాడ్జింగ్‌కు వచ్చిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా? లేక మరేదైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చత్తీస్ ఘడ్‌లో ఉన్న మృతుని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 2, 2026

జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 7న జాబ్ మేళా

image

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 7న టీఎస్‌కేసీ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమేశ్ తెలిపారు. 18 ఏళ్లు పైబడిన యువత, డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. SSC నుంచి పీజీ వరకు అర్హత కలిగిన వారికి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 13 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాలో హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించనునట్లు వివరించారు.

News April 2, 2026

KNR: నూతన ఆర్థిక సంవత్సరానికి ఘన స్వాగతం

image

కరీంనగర్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో నూతన ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ట్రెజరీ అధికారి నాగరాజు కేక్ కట్ చేసి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఆర్థిక సంవత్సరం అభివృద్ధి, పారదర్శకతకు దారితీయాలని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరీ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.

News April 2, 2026

KNR: అనాథలకు డిప్లొమా కోర్సుల్లో 70% సీట్లు

image

తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026-27కు అనాథ విద్యార్థులకు పాలిటెక్నిక్‌లలో ఉచిత ప్రవేశాల దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. సివిల్, ఈఈఈ, కంప్యూటర్, ఈసీఈ కోర్సుల్లో సీట్లను మే 25లోపు కరీంనగర్ బాల రక్షా భవన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) ఫోన్ నంబర్ 7396424387 ను సంప్రదించాలని తెలిపారు.