News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 21, 2026
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

పరవాడ మండలం బొట్టవానిపాలెం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. బొట్టవానిపాలెం గ్రామానికి చెందిన బొట్టా రమణమ్మ (56) పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొన్నట్లు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
News March 21, 2026
KNR: అమలుకు నోచుకోని రాజీవ్ యువ వికాసం..!

కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు నోచుకోక నిరుద్యోగుల్లో నిరాశ పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 1,44,640 మంది యువత దరఖాస్తు చేసుకోగా, KNRలో 42,565, పెద్దపల్లిలో 47,470, జగిత్యాలలో 31,128, రాజన్న సిరిసిల్లలో నమోదు చేసుకున్నారు. స్వయం ఉపాధికి రూ.3 లక్షల వరకు సాయం ప్రకటించినప్పటికీ, సంవత్సరం గడిచినా పురోగతి కనిపించక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News March 21, 2026
తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న CM చంద్రబాబు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సమేతంగా CM చంద్రబాబు శనివారం ఉదయం ఆలయానికి చేరుకున్నారు. వైకుంఠ 1 నుంచి క్యూ లైన్‌లో స్వామి వారి మహాద్వారం వద్దకు రాగా అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని ఆలయంలోకి వెళ్లారు.


