News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 13, 2026
మొజ్తబా ఓ కీలుబొమ్మ: నెతన్యాహు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని ఇజ్రాయెల్ PM నెతన్యాహు విమర్శించారు. ఆయన రివల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మ అని, బయటకు కూడా రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మరణించారని తెలిపారు. ‘ఇరాన్ ప్రజలు స్వేచ్ఛా మార్గం వైపు అడుగులు వేసే సమయం వచ్చింది. మేం వారికి అండగా ఉంటాం. కానీ మార్పు మాత్రం వారి చేతుల్లోనే ఉంది’ అని పేర్కొన్నారు.
News March 13, 2026
బాపట్ల: అనుమానంతో పెళ్లి నిరాకరణ.. తల్లీకూతురి ఆత్మహత్య

మార్టూరు మండలం ద్రోణాదులలో తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం కలిగించింది. సిరికొండ దివ్యకు మార్టూరుకు చెందిన రావులకొల్లు శేషుబాబుతో గతేడాది డిసెంబర్ 14న ఎంగేజ్మెంట్ జరిగింది. దివ్యను అనుమానించిన శేషుబాబు పెళ్లికి నిరాకరించాడు. దీంతో మనస్థాపానికి గురైన తల్లీకూతుర్లు దివ్య, సుజాత ఈనెల 4న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుంటూరులో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.
News March 13, 2026
దేశంలోనే భద్రాద్రి టాప్..!

దేశంలోనే అత్యధికంగా భద్రాద్రి పోలీసులు ఏడాది కాలంలో 6500 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. పట్టుబడిన నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో జరిగిన అవేర్నెస్ ప్రోగ్రాంలో మాట్లాడారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరాలన్నారు.


