News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 22, 2026

కాబోయే తండ్రుల్లోనూ ‘ప్రెగ్నెన్సీ’ లక్షణాలు

image

గర్భిణుల్లో వాంతులు, అలసట, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి, బరువు పెరగటం సహజం. కానీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొందరు భర్తల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే Couvade సిండ్రోమ్ అంటారు. భాగస్వామితో బలమైన భావోద్వేగ అనుబంధం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 20% మందిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు. కొందరు పురుషుల్లో హార్మోన్ల మార్పులూ జరుగుతాయని పేర్కొంటున్నారు.

News March 22, 2026

కడప: MP మహేశ్‌కు మద్దతుగా బ్యానర్లు

image

కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు MP పుట్టా మహేశ్ యాదవ్‌కి మద్దతుగా కడప జిల్లాలో పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. మైదుకూరు నియోజకవర్గం మొర్రాయిపల్లి రోడ్డులో న్యాయం నిలుస్తుంది, నిజాయితి గెలుస్తుంది.. వీ స్టాండ్ విత్ పుట్టా మహేశ్, ఇట్లు చాపాడు మండల ప్రజలు అనే వాక్యాలతో బ్యానర్‌లో రాసి ఉంది.

News March 22, 2026

కారంచేడు వద్ద ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

పిడుగురాళ్ల–వాడరేవు జాతీయ రహదారిపై కారంచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారంచేడు వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఒక్కసారిగా ఆగడంతో అదే దారిలో వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కారంచేడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారణాలు ఆరా తీస్తున్నారు.