News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 1, 2026
HYD: ‘సమ్మర్ హాలిడేస్’ వచ్చేశాయ్!

TG ప్రభుత్వం 2026 విద్యాసంవత్సరానికి సంబంధించిన వేసవి సెలవుల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు సెక్రటేరియట్ తెలిపింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యం, భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సెలవుల్లో పిల్లలపై ఓ కన్ను వేసి ఉంచాలని సూచించారు.
News April 1, 2026
రాష్ట్రపతి నోటిఫై చేసిన వెంటనే రాజ్యాంగ హోదా: ఎంపీ సీఎం రమేశ్

అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్‌లో ఉభయసభలు ఆమోదం పొందిన అనంతరం రాష్ట్రపతి నోటిఫై చేసిన వెంటనే రాజ్యాంగ హోదా లభిస్తుందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. బుధవారం లోకసభలో అమరావతి రాజధాని బిల్లుపై మాట్లాడారు. 2028 ఆగస్టు నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.