News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 2, 2026

SRR కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణకు మాతృ భాషా రత్న పురస్కారం

image

ప్రముఖ సాహితీ వేత్త, SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణకు శబ్ద ప్రతిభా బహు క్షేత్రీయ ఫౌండేషన్, నేపాల్ వారు “మాతృ భాషా రత్న అవార్డు”ను ప్రదానం చేశారు. కవి, రచయిత, వక్త, పరిశోధకునిగా బహుముఖీన మైన ప్రజ్ఞ కనబరుస్తూ మాతృ భాషా వికాసానికి ఆయన చేస్తున్న సేవలను, కృషిని గుర్తించి ఈ అవార్డును ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవార్డును SU VC ఉమేష్ కుమార్ చేతులమీదుగా అందుకున్నారు.

News April 2, 2026

కామారెడ్డి కలెక్టరేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాపన్న పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ పాల్గొన్నారు.

News April 2, 2026

బీజేపీతో జాగ్రత్త.. TDPకి ఆప్ ఎంపీ హెచ్చరిక

image

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక పార్టీలను మోసం చేసిన చరిత్ర బీజేపీదని, ఆ పార్టీ విషయంలో టీడీపీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పుడు అధికారం చంద్రబాబు చేతుల్లోనే ఉందని, కేంద్రం నుంచి ఎంత రాబట్టుకోవాలో అంత రాబట్టుకోవాలని సూచించారు.