News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 13, 2026
ఏలూరు జిల్లా జేసీ హెచ్చరిక

ఏలూరు జిల్లాలో గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని జేసీ అభిషేక్ గౌడ్ తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయిస్తే సహించేది లేదని, అక్రమ నిల్వలపై ప్రత్యేక నిఘా ఉంచామని ఆయన స్పష్టం చేశారు.
News March 13, 2026
పోక్సో శిక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానం: VZM ఎస్పీ

ఆరు నెలల్లో జిల్లాలో నమోదైన 17 పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడినట్లు ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. శిక్షల పరంగా రాష్ట్రంలో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. మైనర్ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలు చదువుపై దృష్టి పెట్టాలని, ప్రేమ పేరుతో మోసం చేసే వారి మాటలు నమ్మవద్దని సూచించారు.
News March 13, 2026
హుండీని పక్కన పెట్టేశారు.. కానుకలన్నీ హారతి పళ్లెంలోకే..!

ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో పాలన అస్తవ్యస్తంగా మారింది. భక్తులకు సౌకర్యాల కంటే ఆదాయానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. మహానందిలోని రామాలయం వద్ద ఎన్నో ఏళ్లుగా ఉన్న హుండీని బయట ఉన్న ఉత్సవ విగ్రహాల వద్దకు మార్చడం చర్చనీయాంశంగా మారింది. హుండీని పక్కకు మార్చడంతో అందులో వేయాల్సిన కానుకలు హారతి పళ్లెంలో వేయాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. దీంతో ఆలయ ఆదాయానికి గండి పడుతోంది.


