News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 3, 2026
విద్యార్థులకు అలర్ట్.. 8 నుంచే పరీక్షలు

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA2) పరీక్షల షెడ్యూల్ మారింది. APR 10వ తేదీ నుంచి ఎగ్జామ్స్ పెట్టాలని భావించినా ఓపెన్ స్కూల్ పరీక్షల వల్ల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. 1-7తరగతుల వారికి 9Am-11.30Am వరకు, 8వ తరగతికి 9Am-11.45Am, నైన్త్ విద్యార్థులకు 9Am-12Pm వరకు పరీక్షలు జరుగుతాయి. APR 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 24 నుంచి సెలవులు ఇవ్వనున్నారు.
News April 3, 2026
HYDలో ట్రాఫిక్ జామ్.. కారణం ఇదే!

ఐటీ కారిడార్‌లోని సైబర్ టవర్స్ వద్ద మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఉదయం వేళ కేవలం ఒక గంటలోనే ఏకంగా 10,138 మంది ఒంటరి వాహనదారులు (సింగిల్ రైడర్లు) వెళ్లినట్లు గుర్తించారు. డబుల్ రైడర్లు 3,584 మంది మాత్రమే ఉన్నారని తేలింది. ఈ స్థాయిలో సింగిల్ రైడర్ల సంఖ్య పెరగడం వల్లే రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.
News April 3, 2026
KNR: సర్వర్ డౌన్.. ఈనెల 6 నుంచి అందుబాటులోకి మీసేవ సేవలు

సర్వార్‌లోని సాంకేతిక సమస్యను పరిష్కరించడంతోపాటు, మీసేవకు అనుబంధంగా ఉన్న 30 GOVT పోర్టల్స్‌ను ప్రభుత్వం అప్డేట్ చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి KNR జిల్లాలోని 518 మీసేవ కేంద్రాల్లో సర్వీసులు నిలిచిపోయాయి. రెవెన్యూ సర్టిఫికేట్ల జారీ, ఆర్టీఏ చలాన్లు, రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్స్ నిలిచిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మీసేవ సేవలు ఈనెల 6న అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.


