News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 27, 2026
కారంచేడులో నాణేల ప్రదర్శన

కారంచేడు కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించారు. ఆదిపూడికి చెందిన కాలువ రఘురామయ్య సేకరించిన అత్యంత పురాతనమైన, సీతాసమేత శ్రీరామచంద్రుడి చిత్రాలు కలిగిన నాణేల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ అపురూప నాణేలను తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపారు.
News March 27, 2026
ప్రతి చిన్న విషయానికి సారీ అక్కర్లేదు: సమంత

ఒకే పరిస్థితి ఎదురైనప్పుడు మగాళ్లతో పోలిస్తే మహిళలు 10రెట్లు ఎక్కువగా సారీ చెబుతున్నారని నటి సమంత అన్నారు. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదని, తమను తాము తగ్గించుకోవడం ఆపాలని కోరారు. ఇక మూవీ ఇండస్ట్రీలో లేడీ యాక్టర్లు గుర్తింపునకు రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. లేడీ ఓరియంటెడ్ మూవీలను రిస్క్‌లాగా చూడటం ఆపాలని ముంబైలో జరిగిన ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రాంలో తెలిపారు.
News March 27, 2026
విజయవాడ: ఈ నెల 30 వరకు గడువు పొడిగింపు

రైల్వే-గ్రూప్ డి పరీక్షకు సిద్ధమయ్యే BC, SC, ST అభ్యర్థులకు BC స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్లాసులలో జాయినయ్యే ఆసక్తి ఉన్న అభ్యర్థులు విజయవాడ అశోక్‌నగర్, పండరీపురం రోడ్ నం: 8లో ఉన్న స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించి ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. గతంలో పేర్కొన్నట్లు దరఖాస్తు గడువు ఈ నెల 25న ముగిసిందని, 30వ తేదీ వరకు గడువు పొడిగించామని చెప్పారు.


