News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 24, 2026
VZM: క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం

జిల్లాలో క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా టీబీ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ ఎస్. జీవనరాణి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ 100 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. హై-రిస్క్ ప్రాంతాల్లో స్క్రీనింగ్, గ్రామాల వారీగా వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
News March 24, 2026
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

*గద్వాల: టీబీ అంతం- అందరి పంతం- అడిషనల్ కలెక్టర్
*లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి- ఎస్పీ
*సాగునీటి ప్రాజెక్టులు సందర్శించిన కలెక్టర్
*అలంపూర్: హామీలు అమలు చేయమంటే అరెస్ట్ చేస్తారా
*గట్టు: రైతుకు పాముకాటు- ఆసుపత్రికి తరలింపు
*అయిజ: క్రాప్ సర్వే 30లోగా పూర్తి చేయాలి
*ఇటిక్యాల: 648 ఎకరాల్లో చిరుధాన్యాల సాగు
*ఉండవెల్లి: రోడ్డు ప్రమాదంలో నిరుద్యోగి మృతి
*రాజోలి: తైబజార్ వేలంపాట 26కు వాయిదా
News March 24, 2026
RCB అమ్మకం.. కొత్త ఓనర్ ఎవరంటే?

RCB జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కన్సార్షియంలో బిర్లా గ్రూప్, US కంపెనీలు డేవిడ్ బ్లిట్జర్, బ్లాక్ స్టోన్, టైమ్స్ ఆఫ్ ఇండియా భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు $1.78Bతో(₹16,706Cr) ఒప్పందం జరిగినట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీకి యునైటెడ్ స్పిరిట్స్(Diageo) యజమానిగా ఉంది.


