News March 29, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధా కిషన్‌రావుకు రిమాండ్
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధా కిషన్‌రావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. ఇప్పటికే మాజీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అరెస్టు అయిన విషయం తెలిసిందే.
Similar News
News November 6, 2024
OTTల్లోకి కొత్త సినిమాలు
ఈ వారం ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి.
*నవంబర్ 7: సమంత, వరుణ్ ధవన్ నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ (అమెజాన్ ప్రైమ్)
*నవంబర్ 8: ఎన్టీఆర్ ‘దేవర’, రజనీకాంత్ ‘వేట్టయన్’, అనుపమ్ ఖేర్ ‘విజయ్ 69’ (నెట్‌ఫ్లిక్స్), సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ (ఆహా), బాలకృష్ణ, సూర్య ‘అన్‌స్టాపబుల్’ షో (ఆహా)
News November 6, 2024
నవంబర్ 14న విద్యార్థులతో కార్యక్రమం: సీఎం రేవంత్
TG: నవంబర్ 14న 15వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు వైరా, మధిర గురుకుల విద్యార్థులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. SC, ST, BC, మైనార్టీల కోసం యంగ్ ఇండియా స్కూళ్లు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీ, ఒలింపిక్ పతకాలే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
News November 6, 2024
ఈ ఏడాది నం.1గా ‘పుష్ప-2’: మైత్రీ మూవీ మేకర్స్
అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప-2’. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ ఏడాది IMDBలో అత్యధిక మంది ఎదురు చూస్తున్న భారతీయ చిత్రాల్లో నం.1గా పుష్ప-2 ఉందని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. కాగా ఈ నెలలో మూవీ టీజర్ రానున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.