News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
మెదక్ జిల్లాలో ఆసుపత్రి సేవలపై డీసీహెచ్ఎస్ సమీక్ష

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచాలని డీసీహెచ్ఎస్ డా. శివ్ దయాల్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, కౌడిపల్లి ఆసుపత్రుల వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓపీ, ఐపీ సేవలు, ప్రసవాలు, డయాలసిస్ విభాగాల పనితీరును పరిశీలించారు. ఆసుపత్రుల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
News March 18, 2026
3వేల డీజిల్ బస్సులు ఈవీలుగా..: CM

TG: హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం తిరుగుతున్న 3వేల డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పెట్రోల్‌తో నడిచే ఆటోలనూ ఈవీలుగా మార్చే కార్యాచరణ చేపడుతున్నామన్నారు. కోర్ సిటీలోని పరిశ్రమలను నగరం వెలుపలకు తరలిస్తామని చెప్పారు. కోర్ సిటీలో సర్వీస్ సెక్టార్ మాత్రమే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.
News March 18, 2026
JNTUH-UAM ముక్కోణపు సహకారానికి LOI ప్రారంభం

జర్మనీకి చెందిన UAM ప్రతినిధి బృందం బుధవారం JNTUHను సందర్శించి ఉపకులపతి డాక్టర్ టి. కిషన్ కుమార్‌తో భేటీ అయ్యారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ విభాగాల్లో నాలుగేళ్ల బ్యాచిలర్ ప్రోగ్రామ్‌ల కోసం JNTUH, UAM మరియు అనుబంధ కళాశాలల మధ్య ముక్కోణపు సహకారానికి (LOI) అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యావకాశాలు లభించనున్నాయి.


