News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
ఆయన త్యాగఫలమే ప్రత్యేక రాష్ట్రం

ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి నేడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఈ త్యాగ ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది పడింది. గాంధీజీకి శ్రీరాములు అంటే ఎంతో అభిమానం. అందుకే ‘శ్రీరాములు లాంటి వారు మరో పదిమంది ఉంటే ఏడాదిలోనే స్వరాజ్యం తెస్తాను’ అని గాంధీజీ చెప్పేవారు.
News March 16, 2026
KNR: రైలు పట్టాలపై ఛిద్రమైన శరీరం

KNR(D) జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల ప్రకారం.. సుమారు 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు చెప్పారు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేదా ప్రమాదవశాత్తూ ట్రైన్ కింద పడ్డాడా అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. <<19391279>>నిన్న<<>> కూడా JMKTలో ఇలాగే ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.
News March 16, 2026
NZB: ఇంటర్ అమ్మాయిలకు అద్భుత అవకాశం

ఉమ్మడి నిజామాబాదు జిల్లాలోని 71 కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CET పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.200గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష మే 3న నిర్వహించనున్నారు. ఇందులో ఎంపికైన వారికీ జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.


