News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 14, 2026

KNR: కనుమరుగవుతున్న జానపద కళ.. ‘వీధి నాటకం’ గత వైభవమేనా?

image

ఒకప్పుడు పల్లెల్లో వినోదానికి, విజ్ఞానానికి చిరునామాగా నిలిచిన వీధి నాటకాలు నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అస్తిత్వ పోరాటం చేస్తున్నాయి. సినిమా తారలు లేకపోయినా, భారీ సెట్టింగులు లేకపోయినా.. కేవలం గొంతులో ఉన్న సత్తాతో, కాళ్ల గజ్జెల సవ్వడితో జనాన్ని కట్టిపడేసిన ఈ జానపద కళ ఆధునిక పోకడల మధ్య నలిగిపోతోంది. జానపద కళను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం కళాకారులదే కాదు, ప్రభుత్వం, సమాజంపై కూడా ఉంది.

News March 14, 2026

కూనవరంలో అగ్ని ప్రమాదం

image

షార్ట్ సర్క్యూట్ కారణంగా కూనవరం మండలం వెంకన్నగూడెంలో శుక్రవారం రాత్రి ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన సోడే అర్జున్‌ ఇల్లు ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. అలుముకున్న మంటలను ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినా నియంత్రణలోకి రాలేదు. సామగ్రి అంతా బూడిద అయింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 14, 2026

ధర్పల్లి: మహిళ హత్య కేసులో రిమాండ్

image

ధర్పల్లి: మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. చత్రు తండాకు చెందిన కాంతి(50)ని డబ్బుల గొడవతో ధర్పల్లికి చెందిన నర్సయ్య అనే వ్యక్తి నైలాన్ దారంతో ఉరివేసి హత్య చేసినట్లు సీఐ భిక్షపతి వెల్లడించారు. మృతదేహాన్ని బైక్‌పై తరలిస్తుండగా కిందపడిపోవడంతో నిందితుడు అక్కడే వదిలి పారిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.