News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: కలెక్టర్

కలెక్టర్ డా.లక్ష్మీశ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ కలెక్టరేట్‌లో జిల్లా కన్సల్టేటివ్ (DCC), రివ్యూ కమిటీ (DLRC) సమావేశం నిర్వహించారు. సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు సులభంగా రుణాలు అందించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. జిల్లాలో కీలక పనితీరు సూచికల(KPIs) సాధనలో బ్యాంకులు చురుకుగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్, ఆర్బీఐ, నాబార్డ్ తదితర అధికారులు హాజరయ్యారు.
News March 18, 2026
పల్నాడులో నెట్‌వర్క్ సమస్యలకు చెక్

పల్నాడు జిల్లాలో మొబైల్ నెట్‌వర్క్ సమస్య పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషితో 4జీ టవర్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. డిజిటల్ భారత్ నిధి కింద BSNL ద్వారా 19 టవర్లు మంజూరు కాగా, 2026 డిసెంబర్ నాటికి సేవలు ప్రారంభం కానున్నాయి. అదనంగా Indus Towers సహకారంతో మరో 36 టవర్లు ప్రతిపాదించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నెట్ సమస్యలు తగ్గనున్నాయని ఎంపీ తెలిపారు.
News March 18, 2026
UG, PG విద్యార్థుల కోసం 39 కొత్త కోర్సులు

TG: రాష్ట్రంలోని విద్యార్థుల కోసం 39 కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. UGలో 19, PGలో 10 కోర్సులు, AEDP(అప్రెంటిస్ ఎనేబుల్డ్ డిగ్రీ ప్రోగ్రామ్స్)లో భాగంగా మరో 10 కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 2030 నాటికి వివిధ రంగాల్లో 20L ఉద్యోగాలు ఏర్పడే అవకాశముందని, వాటిని సాధించేలా యువతను సిద్ధం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.


