News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 10, 2026
కొత్తపల్లి: కృష్ణా నదిపై కేబుల్ వంతెన

దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబోతుంది. కృష్ణా నదిపై సోమశిల-సంగమేశ్వరం వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా హైవేల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోద ముద్రవేసింది. మరో రెండు నెలల్లో జాతీయ రహదారుల విభాగం పనులు మొదలు పెట్టినంది. 800 మీటర్లు నిడివి కలిగి ఉండే ఈ బ్రిడ్జి నిర్మాణంకు రూ.1,062 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
News March 10, 2026
కర్నూలు జిల్లా రైతులకు గుడ్ న్యూస్

పీఎం-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు 22వ విడత ఆర్థిక సాయాన్ని ఈ నెల 13 న విడుదల చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే రెండు విడతల్లో రూ.4,000 చెల్లించగా, చివరి విడతగా మరో రూ.2,000 నేరుగా రైతుల ఖాతాల్లో (DBT ద్వారా) జమ కానున్నాయన్నారు. నిధులు సజావుగా అందాలంటే KYC ప్రక్రియను పూర్తి చేయాలి, భూ రికార్డులు ఆధార్‌తో అనుసంధానమవాలన్నారు.
News March 10, 2026
ఉమ్మడి ADB జిల్లాకు గోల్డ్ మెడల్

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి SGF అండర్-14 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలురు సత్తా చాటారు. సోమవారం జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో నిజామాబాద్ జిల్లా జట్టును ఓడించి, ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు గోల్డ్ మెడల్ సాధించినట్లు SGF సెక్రెటరీలు వెంకటేష్, యాకుబ్ తెలిపారు. ప్రతిభ కనబర్చిన క్రీడకారులతో పాటు జట్టు కోచ్, మేనేజర్లు రవి, చంద్ పాషా, యాదగిరి, వామన్‌లను పలువురు అభినందించారు.


