News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
సిద్దిపేట జిల్లాలో కొండెక్కిన చికెన్ ధరలు

సిద్దిపేట జిల్లాలో చికెన్ ధరలు అమాంతం పెరగడంతో మాంసం ప్రియులపై భారం పడుతోంది. ప్రస్తుతం డ్రస్డ్ చికెన్ కిలో రూ.307 ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ రూ.350 వరకు విక్రయిస్తున్నారు. ఎండల తీవ్రత, పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడటంతో ధరలు పెరిగాయని, ప్రాంతాలను బట్టి స్వల్ప మార్పులు ఉండవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
News March 22, 2026
పూతలపట్టు: ప్రమాదంలో మృతి చెందింది వీరే

పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల దర్శనానికి వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మండ్యకు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ (50), భాగ్యలక్ష్మి (45) అక్కడికక్కడే మృతి చెందగా, శశాంక్ (23), పవని (10), మహాలక్ష్మి (12), తుషార (4)లకు గాయాలు అయ్యాయి.
News March 22, 2026
HYD: ముంచుకొస్తోంది.. జర జాగ్రత్త!

వేసవి దృష్ట్యా HYDలో ఒక్కపూట బడులు సాగుతున్నాయి. ఈ గ్యాప్‌లో పిల్లలు సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఒక్కోసారి ఈసరదా వెంటే విషాదం పొంచి ఉండే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీలు గతేడాది 8 మంది లోతు తెలియక, ప్రవాహ తాకిడికి మునిగిపోయారు. వేసవిలో రోజుకు నలుగురి చొప్పున ఈత సరదాకు బలయ్యారని గణాంకాలు చెబుతున్నాయి. పెద్దలు, నిపుణుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పండి.


