News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 3, 2026
ఇకపై వారు 4 పెళ్లిళ్లు చేసుకోలేరు: అమిత్ షా

త్వరలోనే యూనిఫామ్ సివిల్ కోడ్(UCC)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఇకపై చొరబాటుదారులు నాలుగేసి పెళ్లిళ్లు చేసుకోలేరన్నారు. అస్సాంలో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాలు UCC పరిధిలోకి రావని స్పష్టం చేశారు. మేఘాలయలో చొరబాటుదారులు గిరిజన మహిళలను వివాహం చేసుకొని గారో హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌లో బలపడటానికి ప్రయత్నించారన్నారు. దీనివల్ల ఉద్రిక్తతలు తలెత్తాయని చెప్పారు.
News April 3, 2026
చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ: మంత్రి సురేఖ

నగరంలో చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు రాష్ట్ర దేవదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా వరంగల్ (తూర్పు)నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు.
News April 3, 2026
సింహాచలంలో ‘ఉంగరాల వేట’ వినోదం

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత ఆసక్తికరమైన ‘అంగుళీయక అన్వేషణ’ ఉత్సవం జరిగింది. భక్తికి వినోదాన్ని జోడించి స్వామివారి లీలలను కళ్లకు కట్టేలా నిర్వహించారు. కళ్యాణ సమయంలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బంగారు ఉంగరం కనిపించకుండా పోయిందనే నెపంతో ఈ సరదా ఉత్సవాన్ని నిర్వహించడం ఇక్కడి అనాదిగా వస్తున్న ఆచారం.


