News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 15, 2026
Breaking: కొత్త చిక్కుల్లో తాండూరు మాజీ MLA

తాండూరు మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి పేరు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గతంలో MLAల కొనుగోలు కేసు, ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతంతో ఆయన కొత్త చిక్కుల్లో పడ్డారు. ఈగల్ టీమ్ దాడులు, పోలీసులు పైలట్‌ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. దీనికితోడు పోలీసులపై కాల్పులు.. ఆ రివాల్వర్ కూడా అతడి సోదరుడు రితేశ్ రెడ్డిది అని వార్తలు రావడం గమనార్హం.
News March 15, 2026
ఖమ్మం: తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం

కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలో బొలెరో వాహనం పల్టీ కొట్టడంతో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదుటి వాహనాన్ని తప్పించబోయే సమయంలో నియంత్రణ కోల్పోయి ప్రమాదం సంభవించింది. ఘటనలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. టైల్స్ లోడుతో బొలెరో హైదరాబాద్ నుంచి అశ్వరావుపేటకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయమాదారానికి చెందినవారని సమాచారం.
News March 15, 2026
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.182 నుంచి రూ.186, మాంసం రూ.264 నుంచి 295 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


