News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 18, 2026

పశువులపై దాడులు.. పల్లెల్లో వణుకు.. పులి ఎక్కడ ఉందంటే?

image

అటవీశాఖకు సవాల్‌గా మారిన పెద్దపులి సంచారం బుధవారం 18వ రోజుకు చేరింది. ప్రస్తుతం శంఖవరం మండలం కొత్తంగి, కొత్తూరు సమీపంలో పులి ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. గత 17 రోజుల్లో 250 కిలోమీటర్లు సంచరించిన పులి, 15 పశువులపై దాడి చేసింది. దీన్ని పట్టుకునేందుకు 11 హనుమాన్ బృందాలు, 3 ట్రంక్విలైజింగ్ బృందాలు శ్రమిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

VZM: జిల్లా వాసులకు ముఖ్య గమనిక..!

image

జిల్లాలో గృహ అవసర గ్యాస్ సరఫరాపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాథ్ తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సజావుగా కొనసాగుతోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలు అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని ఆయన సూచించారు.