News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు చేయరాదన్నారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 16 నుంచి మార్చి 31 వరకు అమలులో ఉంటాయన్నారు. శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు.
News March 16, 2026
కామారెడ్డి: సమస్యలపై తక్షణమే స్పందించండి: అదనపు కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ పాల్గొని, వచ్చిన దరఖాస్తుదారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను బట్టి అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
News March 16, 2026
NGKL: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వంగూరు మండలం వెలుమల్లపల్లి గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామం పరిధిలోని శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలయ్య (60) అనే రైతు మృతి చెందాడు. SI మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పొలం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న బాలయ్యను శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళుతున్న బొలెరో వాహనం డ్రైవర్ నిద్రమత్తులో బలంగా ఢీకొట్టాడు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


