News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 1, 2026
అనకాపల్లి: రెండు మున్సిపాలిటీలలో వార్డుల పెంపు

అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలలో వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలమంచిలి మున్సిపాలిటీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న 25 వార్డులను 32కి పెంచనున్నారు. గురువారం నుంచి వార్డుల విభజనకు సంబంధించి ప్రాసెస్ మొదలవుతుందని ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. అదేవిధంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 28 నుంచి 40కి పెరగనుంది.
News April 1, 2026
LokPoll సర్వే.. మళ్లీ డీఎంకేదే అధికారం!

త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని LokPoll సర్వే వెల్లడించింది. DMK+కు 40.1% ఓట్లతో 181–189 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి 29% ఓట్లు, 38-42 సీట్లు, విజయ్ నేతృత్వంలోని TVK 23.9% ఓట్లు, 8-10 సీట్లు సాధిస్తాయని పేర్కొంది. ఇక సీఎంగా స్టాలిన్‌కు 41%, విజయ్‌కి 27.1%, పళనిస్వామికి 24.1% మంది మద్దతు పలికారని తెలిపింది.
<<-se>>#ELECTIONS2026<<>>
News April 1, 2026
పెనుగంచిప్రోలు సర్పంచ్ సస్పెండ్

పెనుగంచిప్రోలు సర్పంచి పద్మకుమారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ లక్ష్మిశా ఉత్తర్వులు జారీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు, గ్రీన్ అంబాసిడర్ల నియామకం పేరుతో రూ.1.21 కోట్లు దుర్వినియోగం చేసినట్లు లగడపాటి ప్రవీణ్ ఫిర్యాదు మేరకు విచారణలో డీఎల్పీవో గుర్తించారు. పదవీకాలం ముగిసే ఒక్కరోజు ముందు చర్య తీసుకోవడం గమనార్హం. సర్పంచి భర్త రవికుమార్ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి.


