News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 30, 2026

పెద్దపల్లి: ఆసుపత్రుల్లో టోకెన్ విధానం అమలు చేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలో వైద్యశాఖ పనితీరుపై కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. రోగులకు సత్వర సేవలు అందించేందుకు ఓపీలో టోకెన్ విధానం అమలు చేయాలని, ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ల్యాబ్ ఫలితాలను వేగంగా అందజేస్తూ, విభాగాల వారీగా డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యులు నిర్ణీత పని గంటల్లో అందుబాటులో ఉండి, రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News March 30, 2026

కేయూ హాస్టల్‌లో భయపెడుతున్న ఎలుకలు

image

కాకతీయ విశ్వవిద్యాలయంలో సమ్మక్క సారక్క హాస్టల్‌లో 14 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. దీంతో బెంబేలెత్తిన విద్యార్థులు యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్‌కు వెళ్లగా మందులు లేవని తెలపడంతో ప్రైవేటు హాస్పిటల్స్‌ని ఆశ్రయించారు. కుక్క, బల్లి, ఎలుకల గాట్ల కారణంగా రేబీస్ వ్యాధి వస్తుందన్న భయంతో బెంబేలెత్తుతున్నారు. ఈ సమస్యను నివారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

News March 30, 2026

ప్రజలకు మెరుగైన సేవలను అందించాలి: నిర్మల్ ఎస్పీ

image

ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం ఫిర్యాదులను స్వీకరించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం చేయాలన్నారు.