News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 14, 2026
ఈ జీవికి 3 గుండెలు, 9 మెదళ్లు..!

సముద్ర గర్భంలో నివసించే ఆక్టోపస్‌లు ప్రకృతి వింతలకు నిలయం. వీటికి ఏకంగా మూడు గుండెలు, తొమ్మిది మెదళ్లు ఉండటం విశేషం. ప్రతి చేతికి ఒక మెదడు ఉండటం వల్ల అవి స్వతంత్రంగా పనిచేయగలవు. అంతేకాకుండా వీటి రక్తం మనలా ఎరుపు రంగులో కాకుండా నీలం రంగులో ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్‌కు బదులుగా ‘హెమోసైనిన్’ అనే రాగి ఆధారిత ప్రొటీన్ ఉండటమే ఇందుకు కారణం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 14, 2026
ఏలూరు: పదోన్నతుల కోసం జిల్లా ఎస్పీకి బురిడీ

ఏలూరు జిల్లాలో ఏఎస్ఐ పదోన్నతుల వ్యవహారంలో ఎస్పీ ప్రతాప్ శివకిశోర్‌ను తప్పుదారి పట్టించేందుకు యత్నించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పదోన్నతుల కోసం సమర్పించిన వినతిపత్రంలో మరో సహోద్యోగి సంతకాన్ని వీరు ఫోర్జరీ చేసినట్లు ఎస్పీ గుర్తించారు. పోలీసులే స్వయంగా ఫోర్జరీకి పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News March 14, 2026
ఇండక్షన్ స్టవ్‌లు వాడేవారికి తమిళనాడు ప్రభుత్వం గుడ్‌న్యూస్

గ్యాస్ సంక్షోభం వేళ విద్యుత్ స్టవ్‌లు వినియోగించే వ్యాపారులకు TN ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెస్టారెంట్లు, హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు, టీ స్టాల్స్‌లో కరెంట్ యూనిట్‌పై రూ.2 సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రం విధించిన షరతులు అమల్లో ఉన్నన్ని రోజులు ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే పలు రాష్ట్రాల్లో కమర్షియల్ సిలిండర్ల పంపిణీ ప్రారంభమైనట్లు తాజాగా కేంద్రం పేర్కొంది.


