News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 1, 2026

ఆ దుకాణాలను సీజ్ చేయండి: నంద్యాల కలెక్టర్

image

పాణ్యం మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ రాజకుమారి గణియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ సేవలు, ప్రజలకు అందుతున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ను చూసి డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలు వదిలి వెళ్లడంతో, వాటిని సీజ్ చేయించాలని ఆమె ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

News April 1, 2026

విద్యుత్ సిబ్బంది భద్రత పరికరాలు ధరించాలి: ఎస్ఈ

image

క్షేత్రస్థాయిలో విద్యుత్ పనులు నిర్వహించే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా భద్రతా పరికరాలు ధరించి పని చేయాలని ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ గౌతమ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్ రాడ్ వంటి భద్రతా పరికరాలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు చేయరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News April 1, 2026

వరంగల్ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు వరుసగా మూడు రోజుల సెలవులు ప్రకటించారు. ఈ నెల 3న శుక్రవారం గుడ్ ప్రైడే, శనివారం, ఆదివారం వారాంతరపు సెలవుల కారణంగా మార్కెట్ యార్డ్‌లో క్రయ, విక్రయాలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. తిరిగి ఈ నెల 6న మార్కెట్ యార్డ్ పునః ప్రారంభం అవుతుందన్నారు. రైతులు సహకరించాలని కోరారు.