News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 19, 2026

బుమ్రా తర్వాత ఎవరు?.. అశ్విన్ ఆందోళన!

image

బుమ్రా రిటైర్మెంట్ తర్వాత భారత బౌలింగ్ విభాగం ఎదుర్కోబోయే ఛాలెంజెస్‌పై అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బ్యాటర్ల డామినేషన్‌ నడుస్తోందని, ఇది ఇప్పటి పిల్లలు బౌలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోకుండా డిస్‌కరేజ్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్ లేకపోతే టోర్నీలు గెలవడం కష్టమన్నారు. టీమ్ ప్రయోజనాలకే ఇంపార్టెన్స్ ఇచ్చే గంభీర్ శైలిని ఈ సందర్భంగా ప్రశంసించారు.

News March 19, 2026

జనగామ: కలెక్టర్ హుకుం.. సీపీఎం ఆగ్రహం.. హైకోర్టు తీర్పే కీలకం!

image

జనగామ జిల్లా గత కలెక్టర్ రిజ్వాన్ బాషా కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేయించిన టీ, విజయ డెయిరీ స్టాళ్లను తొలగించాలని ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హుకుం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే స్టాళ్ల నిర్వాహకులకు అండగా నిలిచిన సీపీఎం.. కలెక్టర్‌పై పోలీస్ కేసు నమోదు చేయడంతో పాటు స్టాళ్లను తొలగించవద్దని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబధించి సోమవారం హైకోర్టు ప్రకటించే తీర్పు కీలకం కానుంది.

News March 19, 2026

నాగార్జునసాగర్ 115 టీఎంసీల షిల్ట్ పూడిక

image

కృష్ణానదిపై నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూడికతో కుదేలవుతోంది. అసలు 427 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయంలో ప్రస్తుతం సుమారు 115 టీఎంసీల వరకు పూడిక పేరుకుపోయినట్లు తెలుస్తోంది. పూడికతో ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు చేరింది. దీంతో జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గి సాగు, తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతోంది.