News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 16, 2026

శుక్రుడు మరీ ఇంత స్లోనా?

image

సౌర కుటుంబంలో అత్యంత వింతైన గ్రహం శుక్రుడు. సాధారణంగా గ్రహాలకు తమ చుట్టూ తాము తిరగడానికి పట్టే సమయం(రోజు) కంటే, సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే సమయం (సంవత్సరం) ఎక్కువ. కానీ శుక్ర గ్రహం తన చుట్టూ తాను నెమ్మదిగా తిరుగుతుంది. అందుకే అక్కడ ఒక రోజు(243d) గడవకముందే ఒక సంవత్సరం(225d) పూర్తవుతుంది. ఈ కాలగమనం ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 16, 2026

కాకినాడ: అధికారుల కళ్లుగప్పి.. రూటుమార్చిన ‘పులి’

image

పులి మరోసారి రూటుమార్చింది. జి.కొత్తపల్లిలో పట్టుకునేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే సాయంత్రం శంఖవరం కొండపై నుంచి దిగి హనుమాన్ బృందాల టార్గెట్ తప్పించుకుని అన్నవరం సమీపంలోని పంపా రిజర్వాయర్ వైపు ఉన్న సర్వే తోటలు, వ్యవసాయ క్షేత్రాల వైపు వెళ్లిందని అధికారులు ప్రకటించారు. విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు. నిరంతర పర్యవేక్షణ చేస్తూ ప్రజల భద్రత, పులి సంరక్షణపై దృష్టిపెట్టారు.

News March 16, 2026

నరసరావుపేట: ‘నగదు రహిత వైద్యం అందించాలి’

image

కలెక్టర్ కృత్తికా శుక్లా అధ్యక్షతన కలెక్టరేట్‌లో డా. ఎన్టీఆర్ వైద్య సేవలపై డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం నిర్వహించారు. మొత్తం 29 ఫిర్యాదులను డా. జి. చంద్రశేఖర్ వివరించారు. డా. ఎన్టీఆర్ వైద్య సేవల పరిధిలో వచ్చే రోగులకు పూర్తిగా నగదు రహిత వైద్యం అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పేషెంట్ల వద్ద నుంచి బిల్లులు వసూలు చేయకుండా యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.