News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 7, 2026

కామారెడ్డి: పోలీస్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ

image

పోలీస్ సిబ్బందిని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. భిక్కనూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నానని 100 నంబర్‌కు డయల్ చేశారు. తక్షణమే స్పందించిన కానిస్టేబుల్స్ వినయ్ కుమార్, రామాంజనేయులు ఘటనా స్థలానికి వెళ్లి అతని ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ అభినందిస్తూ నగదు ప్రోత్సాహం అందజేశారు.

News March 7, 2026

NZB: 14 ఏళ్ల బాలికలకు HPV టీకా ఇప్పించాలి: DMHO

image

14 ఏళ్ల బాలికలందరికీ HPV టీకా ఇప్పించాలని NZB DMHO రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 14 సంవత్సరాల బాలికలందరికీ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు HPV టీకాలు కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభిస్తారని ఆమె చెప్పారు. 7 మార్చి 2011 నుంచి 8 మార్చి 2012 మధ్యలో పుట్టిన అమ్మాయిలకు ఈ టీకా ఇప్పించాలన్నారు.

News March 7, 2026

JGL: మావోయిస్టు సిద్ధాంతాన్ని ప్రశ్నించని గణపతి కుమారుడు

image

మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు నేపథ్యంలో ఆయన కుమారుడు శ్రీనివాసరావు ఆవేదనపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తండ్రి ఎంచుకున్న ఉద్యమ మార్గాన్ని విమర్శించకపోయినా, ఆ ఆశయం వెనుక కుటుంబం అనుభవించిన నరకాన్ని మౌనంగా గుర్తుచేశారు. మీ సిద్ధాంతాన్ని ప్రశ్నించడం లేదని చెప్పడం ద్వారా తండ్రి ఆత్మార్పణ పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూనే విప్లవం అంటే కేవలం త్యాగాలే కాదు, ఆత్మీయులకు గుండెకోత తీరనిదని అభిప్రాయపడ్డారు.