News March 29, 2024
వారి ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేల్చిన ఇద్దరు కీలక నిందితుల కోసం వేట కొనసాగుతోంది. వారి ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు ఇస్తామని NIA ప్రకటించింది. నిందితుల ఆచూకీ తెలిసిన వాళ్లు 89042 41100 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపింది. కాగా ఈ కేసులో ఇప్పటికే NIA ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసింది. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో నలుగురు గాయపడ్డ విషయం తెలిసిందే.
Similar News
News March 19, 2026
సంగారెడ్డి: ఉగాది.. భుజబలం చాటిన పహిల్వాన్లు

కల్హేర్(M) మార్డిలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఏటా ఆనవాయితీగా వస్తున్న ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పహిల్వాన్లు తమ భుజబలాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. రసవత్తరంగా సాగిన ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన మల్లయోధులకు గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రవీందర్ రెడ్డి నగదు బహుమతులను అందజేసి అభినందించారు. ఈ విన్యాసాలను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు.
News March 19, 2026
పంచాంగ పఠనం.. రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి ఉంటుందన్న మాడుగుల

AP: ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. పరాభవ నామ సంవత్సరంలో ప్రభుత్వానికి విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. లగ్నాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం బాగానే ఉంటుందని.. ఉగాదికి ముందుగానే కురిసిన వర్షం దీనికి సూచిక అని తెలిపారు. అమరావతి విశ్వనగరిగా ఎదుగుతుందని.. రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి ఉంటుందని చెప్పారు. ప్రజలు సుఖ శాంతులతో ఉంటారని వివరించారు.
News March 19, 2026
PNG.. జిల్లాల వారీగా ఈ కంపెనీల సర్వీసులు

ఏపీలోని అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో THINK GAS అనే కంపెనీ PNG సర్వీసును అందిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో IOCL, ఉభయగోదావరిలో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్, విజయవాడ, కాకినాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్(BGL), కృష్ణాలో మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. HYDలో BGL, పలు జిల్లాల్లో IOCL సర్వీసులు ఉన్నాయి.


