News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 15, 2026

చలో స్టేషన్ ఘన్‌పూర్.. భారీగా తరలివెళ్లిన బీఎస్పీ శ్రేణులు

image

మాన్యశ్రీ కాన్షీరామ్ జయంతిని పురస్కరించుకొని స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహిస్తున్న ‘చలో స్టేషన్ ఘన్‌పూర్’ సభకు పెద్దపల్లి జిల్లా నుండి BSP శ్రేణులు భారీగా తరలివెళ్లారు. BSP జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ యాదవ్, మంథని నియోజకవర్గ ఇంచార్జి జనగామ రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంనుండి బస్సుల్లో బయలుదేరారు. కాన్షీరామ్ ఆశయ సాధన కోసం, బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు.

News March 15, 2026

వనపర్తి: పీఆర్సీని అమలు చేయాలి: తపస్

image

ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని తపస్ వనపర్తి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణ, శశివర్ధన్‌లు డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన వినతిపత్రాన్ని ఆదివారం MLA మేఘారెడ్డికి ఆయన నివాసంలో యూనియన్ ఆధ్వర్యంలో అందజేశారు. వారు మాట్లాడుతూ.. పీఆర్సీ పైన ప్రభుత్వం వెంటనే స్పందించేలా చూడాలని, అలాగే పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. వరప్రసాద్ గౌడ్, విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

News March 15, 2026

రేపు కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.