News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 15, 2026

రేపు బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో PGRS

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు గతంలో వచ్చిన అర్జీల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరుగుతుంది. అనంతరం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ఫిర్యాదుల వివరాలు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చని అన్నారు.

News March 15, 2026

శ్రీరామనవమి నాడు ‘భద్రగిరి గిరిజన మార్ట్’ ప్రారంభం

image

గిరిజన మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా శ్రీరామనవమి నాడు భద్రగిరి మార్ట్ ప్రారంభించనున్నట్లు APO డేవిడ్ రాజ్ వెల్లడించారు. ఆదివారం స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ.. మార్ట్ విజయవంతానికి వ్యాపారులు తమ సలహాలు, సూచనలు అందించాలని, ప్రజలకు నిత్యం అవసరమయ్యే సరుకుల జాబితాను సిద్ధం చేయాలని కోరారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తూనే, నాణ్యమైన వస్తువులను అందుబాటులో ఉంచుతామన్నారు.

News March 15, 2026

వలిగొండ: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

image

వలిగొండ-తిరుమలగిరి ప్రధాన రహదారిపై యాదాద్రి జిల్లా అరూరు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు ప్రారంభించారు.