News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 17, 2026
WGL: స్తంభించిన రియల్ ఎస్టేట్..!

ఉమ్మడి జిల్లాలో రియల్ ఎస్టేట్ కొంతకాలంగా మందగమనంలో సాగుతోంది. రెండేళ్లుగా క్రయవిక్రయాలు గణనీయంగా తగ్గిపోవడంతో అటు వ్యాపారులు, ఇటు రిజిస్ట్రేషన్ శాఖ ఆందోళన చెందుతున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే, 2024లో 1,05,834 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, 2025లో 1,03,784, 2026లో ఇప్పటివరకు 19,146 డాక్యుమెంట్లు నమోదయ్యాయి. గతంలో రోజుకు సగటున 170 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో ప్రస్తుతం 40 కూడా దాటడం లేదు.
News March 17, 2026
పల్నాడు: యువతి కిడ్నాప్ కలకలం.. పోలీసుల ఛేజింగ్‌తో సురక్షితం!

రొంపిచర్ల మండలం తుంగపాడులో యువతి కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న యువతిని బైకులపై వెంబడించిన దుండగులు అపహరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా గాలింపు చేపట్టారు. అన్నారం వద్ద నిందితుల వాహనాలను స్వాధీనం చేసుకోగా.. పోలీసుల సాయంతో యువతి సురక్షితంగా స్టేషన్‌కు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
News March 17, 2026
కొడంగల్ ఎత్తిపోతలపై సీఎం స్పెషల్ ఫోకస్

సొంత నియోజకవర్గ దాహార్తిని తీర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. దాదాపు రూ.4,885 కోట్ల నిధులతో ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా 10 రిజర్వాయర్లను నిర్మించనున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుపై సీఎం తీసుకున్న నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


