News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 20, 2026
గోవాలో IEMDST-2026 సదస్సు

గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT Goa) ఆధ్వర్యంలో జూన్ 8, 9 తేదీల్లో “IEMDST-2026” అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సు NIT వరంగల్ ఫిజిక్స్ విభాగంతో కలిసి నిర్వహిస్తున్నారు. సస్టైనబుల్ టెక్నాలజీలకు సంబంధించిన మెటీరియల్స్, డివైసెస్‌పై పరిశోధనలు ప్రదర్శించే వేదికగా ఇది నిలుస్తుంది. దేశ, విదేశాల శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొననున్నారు.
News March 20, 2026
2014 నుంచి 6వేల ఫోన్లు ట్యాప్: రేవంత్

TG: BRS ప్రభుత్వ హయాంలో 6వేల ఫోన్లను ట్యాప్ చేయించారని CM రేవంత్ వెల్లడించారు. ‘ట్యాపింగ్ కేసులో చట్టప్రకారం ముందుకెళ్తున్నాం. విచారణ పూర్తికాకుండా అరెస్టులు చేయలేం. పంజాగుట్ట PSలోని కేసులో హరీశ్‌కు ఊరట వస్తే మొత్తానికి క్లీన్‌చిట్ వచ్చినట్లు BRS ప్రచారం చేస్తోంది. 2014 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికే IAS అరవింద్ కుమార్‌ను సస్పెండ్ చేశాం’ అని రేవంత్ మీడియాతో చిట్‌చాట్‌లో తెలిపారు.
News March 20, 2026
‘ఆస్కార్’ స్థాయికి చేరడమే నా లక్ష్యం: తమన్

తెలుగు సినిమా మార్కెట్ గ్లోబల్ స్థాయికి చేరుకుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. మన చిత్రాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు. రాబోయే రోజుల్లో తాను చేసే సినిమాలతో ఆస్కార్ స్థాయికి చేరుకోవడమే లక్ష్యమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మన మట్టి వాసన ఉన్న సంగీతాన్ని ట్రెండ్స్‌కు అనుగుణంగా అందిస్తే ఆస్కార్ సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఇక ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌తో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని చెప్పారు.


