News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 7, 2026

విద్యాశాఖలో ఖమ్మం జిల్లా నంబర్ 1: కలెక్టర్

image

విద్యాశాఖ పనితీరులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో జిల్లా సాధించిన ఈ ఘనత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో రాబోయే పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

News March 7, 2026

కామారెడ్డి: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించిన ఇమ్యునైజేషన్ అధికారి

image

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో HPV వ్యాక్సిన్ ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.రోహిత్ RMO డా.సంతోష్‌తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలోని సంబంధిత గదులను పరిశీలించారు. వాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిర్ణీత వయసు కలిగిన బాలికలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News March 7, 2026

‘సిగ్గుచేటు’.. బెంగాల్ ప్రభుత్వంపై మోదీ ఫైర్

image

బెంగాల్‌లోని TMC ప్రభుత్వంపై PM మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన రాష్ట్రపతి <<19322594>>ద్రౌపదీ ముర్ము<<>>ను అవమానించేలా బెంగాల్ యంత్రాంగం వ్యవహరించడం సిగ్గుచేటని, ఇది ప్రజాస్వామ్యానికే విఘాతమని విమర్శించారు. సంతాల్ సంస్కృతిని TMC ప్రభుత్వం చాలా చులకనగా చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రపతి కార్యాలయం రాజకీయాలకు అతీతమని, ఆ పదవికి ఉన్న పవిత్రతను గౌరవించాలని హితవు పలికారు.