News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 24, 2026

క్షయ వ్యాధి రహిత ఆదిలాబాదే లక్ష్యం..!

image

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో క్షయ (టీబీ) వ్యాధి నిర్మూలనకు వైద్యారోగ్య శాఖ ముమ్మర చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో సుమారు 5,800 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ‘నిక్షయ్‌ మిత్ర’ పథకం ద్వారా దాతలు బాధితులను దత్తత తీసుకుని పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా ₹500 రోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం.
# నేడు క్షయ వ్యాధి నివారణ దినోత్సవం

News March 24, 2026

ట్రంప్ ప్రకటనతో దిగొచ్చిన చమురు ధరలు

image

ఇరాన్‌పై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో యుద్ధ భయాలు తగ్గాయి. దీంతో చమురు ధరలు 13% మేర దిగొచ్చి $95 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సోమవారం ఉదయం భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు సాయంత్రానికి మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ₹1.46 లక్షల వరకు చేరింది. ఈ సానుకూల పవనాలతో మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

News March 24, 2026

క్షయ వ్యాధిపై ఇందూరు పోరాటం..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్షయ నిర్మూలన లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 4,200మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. నిక్షయ్ మిత్ర పథకం ద్వారా దాతలు బాధితులను దత్తత తీసుకుని పౌష్టికాహార కిట్లను అందిస్తున్నారు. ప్రభుత్వం నిక్షయ్ పోషణ్ యోజన కింద నెలకు ₹500 ఆర్థిక సాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది.
# నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం