News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 11, 2026

ప్రకాశం: వడగాల్పులపై ముందస్తు చర్యలు

image

ప్రకాశం జిల్లాలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల సమయాల్లో మార్పులు చేయాలని, మధ్యాహ్నం పనులు నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి బోర్లు మరమ్మతు చేసి, నీటి కొరత లేకుండా చూడాలని అన్నారు.

News March 11, 2026

నిర్మల్: మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ

image

నిర్మల్ జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రారంభం కానుందని జిల్లా సంక్షేమ అధికారి ఆర్.మోహన్ సింగ్ తెలిపారు. యువతకు ఉపాధి, స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 12, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News March 11, 2026

నెక్లెస్ రోడ్‌ నీరా కేఫ్ భవనం లీజుకు టెండర్ల ఆహ్వానం

image

నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న నీరా కేఫ్ భవనాన్ని లీజుకు ఇవ్వడానికి తెలంగాణ TD టాపర్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భవనంలో నీరా ప్రాసెసింగ్ యూనిట్, బ్యాంకెట్ హాల్‌తో పాటు 7 వాణిజ్య దుకాణాలు ఉన్నట్లు మేడ్చల్ జిల్లా BC అభివృద్ధి శాఖ అధికారి ఝాన్సీరాణి తెలిపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో గౌడ వృత్తికి చెందిన సంఘాల నుంచి నిర్దిష్ట నిబంధనలు, మేరకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.