News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 20, 2026

శ్రీవారి సన్నిధిలో ఇక కల్తీకి చెక్: సత్యకుమార్

image

AP: శ్రీవారి లడ్డూ, అన్న ప్రసాదాల్లో నాణ్యత, స్వచ్ఛత పెంచేలా చర్యలు తీసుకున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘తిరుమలలో ఏర్పాటైన స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని CM CBN రేపు ప్రారంభిస్తారు. నెయ్యి, నూనె, పాలు, ఇతర ముడిసరకుల్లో కల్తీని పసిగట్టే పరీక్షలు ఇక్కడ జరుగుతాయి. ఫెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్ వంటి అవశేషాలనూ గుర్తిస్తారు. పుణ్య క్షేత్రాల్లో ఇలాంటి ల్యాబ్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి’ అని తెలిపారు.

News March 20, 2026

శాంతియుత వాతావరణంలో రంజాన్ చేసుకోవాలి: KMR SP

image

కామారెడ్డి SP రాజేశ్ చంద్ర శుక్రవారం సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. రంజాన్ పండుగ వేళ భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని, ట్రాఫిక్ నియంత్రణ, CC కెమెరాల పర్యవేక్షణపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పండుగ వేళ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూనే శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదన్నారు.

News March 20, 2026

మహబూబాబాద్‌: ఓపెన్ డ్రింకింగ్‌పై జిల్లా వ్యాప్తంగా దాడులు

image

జిల్లాలో గంజాయి వినియోగం, బహిరంగ మద్యపానాన్ని అరికట్టేందుకు ఎస్పీ డా.శబరీష్‌ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పది రోజుల్లో 130 ప్రదేశాల్లో దాడులు నిర్వహించి, బహిరంగంగా మద్యం తాగుతూ పట్టుబడిన 37 మందిపై కేసులు నమోదు చేశారు. యువత పెడదోవ పట్టకుండా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నారు. వ్యసనాలకు బానిసైన వారికి పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు.