News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News December 13, 2025

MBNR: 2వ విడత ఎన్నికలు.. భారీ బందోబస్తు: ఎస్పీ

image

రెండో విడత పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 1,249 మంది పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ-1, అదనపు ఎస్పీలు-2, డిఎస్పీలు-7, ఇన్స్పెక్టర్లు-29, సబ్ ఇన్స్పెక్టర్లు-66, మిగతా సిబ్బంది-1,134 మంది పోలీస్ సిబ్బంది జిల్లాలోని హన్వాడ, కోయిలకొండ, దేవరకద్ర, సీసీ కుంట, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాలలో విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News December 13, 2025

అనకాపల్లి: ‘రేపటి నుంచి ఇందన పాదుపు వారోత్సవాలు’

image

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ఇందన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజినీర్ జి.ప్రసాద్ తెలిపారు. ఇందన పొదుపుపై జిల్లా, డివిజన్ కేంద్రాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. కళాశాలలు, హైస్కూల్స్‌లో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాల సభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామన్నారు.

News December 13, 2025

రాంగ్ రూట్‌లో వెళ్లకండి: ప్రకాశం పోలీసులు

image

ప్రకాశం జిల్లాలోని వాహనదారులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఐటీ విభాగం పోలీసులు కీలక సూచనలు చేశారు. కొద్ది దూరమని రాంగ్ రూట్ ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. దూరం కంటే ప్రాణం ముఖ్యమనే విషయాన్ని వాహనదారులు గమనించాలని కోరారు. రాంగ్ రూట్ వెళ్లకుండా వాహనదారులు సహకరించాలన్నారు.