News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 17, 2026

ఏలూరు: రైలు ఢీకొని ఇద్దరు మృతి

image

ఏలూరు రైల్వే స్టేషన్ పరిధిలో రైలు ఢీకొని ఆదివారం ఇరువురు మృతి చెందారు. వట్లూరు – నూజివీడు మధ్య పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నలుపు రంగు జీన్స్, టీ-షర్టు ధరించి ఉన్నాడు. బొమ్మలూరు సమీపంలో మరో ఘటనలో బిహార్‌కు చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

News March 17, 2026

యుద్ధ ప్రభావం: నంద్యాల జిల్లాలో కుప్పకూలిన ధరలు

image

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు నంద్యాల జిల్లా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో ఉత్పత్తుల ధరలు భారీగా పడిపోయాయి. క్వింటాల్ పసుపు రూ.13 వేల నుంచి రూ.9 వేలకు, మొక్కజొన్న రూ.2500 నుంచి రూ.1400కు తగ్గింది. అరటి, నిమ్మ ధరలు సైతం సగానికి పడిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

News March 17, 2026

డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. DCP యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. గత శనివారం TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ సహా మరికొందరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మహేశ్‌కు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్ రెడ్డి, రితేశ్, నమిత్‌కు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.