News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 22, 2026

విశాఖ: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలు

image

తూ.గో.జిల్లా ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. విశాఖలోని సీతమ్మధార, అల్లిపురానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు వాడపల్లి వేంకన్న దర్శనం కోసం వెళ్తుండగా వీరి కారును రాజమండ్రి నుంచి KKD వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. వీరికి జీఎస్‌ఎల్‌ ఆస్పత్రిలో ప్రాథమికచికిత్స అందించారు. కారులో డ్రైవర్‌తో కలిపి ఏడుగురు ఉండగా ప్రాణాప్రాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

News March 22, 2026

మూలపేట పోర్ట్ సకాలంలో పూర్తయ్యేనా ?

image

టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్ట్ పనులు జాప్యంపై వైసీపీ పార్టీ సందర్శనకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ పోర్ట్ ఎప్పటికీ పూర్తయ్యేను? అన్న చర్చ సాగుతుంది. 2023 ఏప్రిల్ 19న రూ.2,949.70 కోట్ల అంచనాతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనులు ప్రారంభించారు. 2025 అక్టోబర్ 17న డెడ్ లైన్ నిర్ణయించారు. మళ్లీ 2026 నవంబరుకి పెంచారు. గడువులోగా పూర్తయ్యేనా అన్నది ప్రధాన చర్చ…!

News March 22, 2026

ఏలూరు జిల్లాలో క్షీణిస్తున్న భూగర్భ జలాలు

image

ఏలూరు జిల్లాలో భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి. జిల్లాలోని 394 గ్రామాల్లో ప్రస్తుతం 194 గ్రామాల్లో 8 నుంచి 20 మీటర్లు లోతులోనూ.. 200 గ్రామాల్లో 20 మీటర్లు పైబడి భూగర్భ జలాల స్థాయి ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. భవిష్యత్తు తరాలకు నీటివనరులు సమృద్ధిగా ఉండే విధంగా భూగర్భ జలాలను పెంపొందించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ద్వారకాతిరుమల, కొయ్యలగూడెం మండలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.