News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News January 12, 2026

చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా: రాంబాబు

image

AP: జగన్‌ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో ₹3.32L కోట్ల అప్పులు చేస్తే చంద్రబాబు ఏడాదిన్నరలోనే ₹3.02L కోట్లు అప్పు చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైసీపీ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు. చంద్రబాబు అప్పులు చేస్తే సింగపూర్‌ అవుతుందా? జగన్‌ చేసిన అప్పుల్లో 90% CBN ఏడాదిన్నరలోనే చేశారు. ఎన్నికల హామీలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు’ అని అంబటి ఫైరయ్యారు.

News January 12, 2026

మేడారం: మహిళలకు ప్రత్యేకంగా మొబైల్ మరుగుదొడ్లు

image

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని అధికారులు మహిళా భక్తుల కోసం మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతరలో మహిళలు మలమూత్ర విసర్జన కోసం ఇబ్బందులు పడవద్దని, ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన రెండు మొబైల్ టాయిలెట్ బస్సులను మేడారంలో ఏర్పాటు చేశారు. మహిళా భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

News January 12, 2026

MGU: బీఈడీ 1, 3 సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఈడీ మొదటి, మూడో సెమిస్టర్ (R-23) రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు మొదటి సెమిస్టర్, ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు మూడో సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు, సంబంధిత కళాశాలల యాజమాన్యాలు ఈ మార్పులను గమనించాలని ఆయన సూచించారు.