News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 16, 2026

అన్నమయ్య: పోలీస్ నిఘా నీడలో పది పరీక్షలు

image

అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. 144సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎగ్జాం సెంటర్ల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకూడదని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.

News March 16, 2026

IPL అంటే మీకు ఏం గుర్తొస్తుంది?

image

మరికొన్ని రోజుల్లో IPL సమరం మొదలవనుంది. ఈ సందర్భంగా ‘IPL అంటే గుర్తొచ్చేది ఏంటి?’ అని ‘Cricbuzz’ ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్నను ట్వీట్ చేసింది. కొందరు చివరి ఓవర్ థ్రిల్లర్లు, స్టేడియంలో కేకలు లేనిదే మజా లేదని కామెంట్స్ చేయగా.. మరికొందరు ఫిక్సింగ్, ఛీటింగ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘ఈసాలా కప్ నమ్దే’ స్లోగన్ లేనిదే IPL కిక్కే లేదని RCB ఫ్యాన్స్ అంటున్నారు. ఇంతకీ IPL అంటే మీకు గుర్తొచ్చేదేంటి? COMMENT

News March 16, 2026

వచ్చే ఏడాదే పోలవరం జాతికి అంకితం: CBN

image

AP: గోదావరి పుష్కరాలకు ముందే 2027లో పోలవరాన్ని జాతికి అంకితం ఇస్తామని CM CBN పునరుద్ఘాటించారు. ‘YCP పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపే ప్రయత్నం చేసింది. రాజధాని లేని రాష్ట్రంలో మూడుముక్కలాట ఆడింది. కానీ అమరావతి నిర్మాణానికి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రైతులు భూములను త్యాగం చేశారు. వారందరూ తల ఎత్తుకునేలా రాజధాని నిర్మిస్తాం’ అని పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సందర్భంగా స్పష్టం చేశారు.