News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రభుత్వం కృషి: లోకేశ్

దివ్యాంగుల గౌరవం పెంచేలా ప్రజా ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరిలో సీఎం చంద్రబాబునాయుడు, డి.సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఉండవల్లి నివాసంలో పథకం లబ్ధిదారులతో జరిగిన ఆత్మీయ విందు సమావేశంలో సీఎంతో కలిపి మంత్రి పాల్గొన్నారు. తన పక్కన కూర్చొన్న శివనాగరాజు, సౌభాగ్య, ఖాశీంబి, అన్నపూర్ణమ్మలతో మమేకమై మాటామంతీ కలిపారు.
News March 18, 2026
ప.గో: రానున్న 3 గంటల్లో భారీ వర్షాలు

రానున్న 3 గంటల్లో ఉమ్మడి ప.గో జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని AP విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఓ ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు పడే అవకాశముందని, ప్రజలెవ్వరూ విద్యుత్ తీగలు తాకవద్దన్నారు. చెట్ల కింద నిలబడవద్దని సూచించారు.
News March 18, 2026
10న తిరుపతిలో రోబోటిక్స్ పోటీలు

తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్(RSC) ఆధ్వర్యంలో ఏప్రిల్ 10న ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు ‘ROBOTRAC 3.0’ అటానమస్ రోబోట్ ఛాలెంజ్ జరగనుంది. ఇద్దరు విద్యార్థులుంటే ప్రతి జట్టు పోటీ వేదికపైనే స్వయంగా లైన్-ఫాలోయింగ్ రోబోలను తయారు చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 6వ తేదీ లోపు https://tinyurl.com/robotrac3rsct ద్వారా అప్లై చేసుకోవాలి.


