News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 16, 2026

జూన్ నెల శ్రీవారి దర్శన కోటా విడుదల వివరాలు

image

జూన్‌కు సంబంధించిన వివిధ దర్శనాలు, సేవలు, గదుల కోటాను ఈనెల 18 నుంచి దశలవారీగా TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. 18న ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రారంభం కాగా, 21న వివిధ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల టికెట్లు విడుదల చేయనుంది. 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు, వృద్ధులు, దివ్యాంగుల ఉచిత దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదులు విడుదల చేస్తారు.

News March 16, 2026

CNG సరఫరాలో కొరత లేదు: కేంద్రం

image

దేశంలో ఇంధన లభ్యతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరా సాఫీగా సాగుతోందని స్పష్టం చేసింది. దేశంలో క్రూడ్ ఆయిల్ సరిపడా ఉందని.. రిఫైనరీలు అన్నీ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తున్నాయంది. పెట్రోల్ పంప్స్‌లో ఎలాంటి కొరత లేదని పేర్కొంది. దేశానికి శివాలిక్, నందాదేవి నౌకల ద్వారా మరో 92,712 టన్నుల LPG రానున్నట్లు తెలిపింది.

News March 16, 2026

VZM: 22ఏ నిషేధిత జాబితా నుంచి 13 మంది రైతులకు విముక్తి

image

రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో భాగంగా 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన 13 మంది రైతులకు ఆయన ఉత్తర్వులు అందజేశారు. రెవెన్యూ, సర్వే అధికారులు రికార్డులు పరిశీలించి భూములు ప్రభుత్వానికి సంబంధించినవి కావని నిర్ధారించారు.