News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 25, 2026

విజయవాడ: రూ. 2 కోట్ల ఆశచూపి రూ.36 లక్షలు కొట్టేశాడు..!

image

పెట్టుబడుల పేరుతో హనుమంతరెడ్డి అనే వ్యక్తిని హరిప్రసాద్ అనే కేటుగాడు దారుణంగా మోసగించాడు. బందర్ రోడ్డులో రూ. 2 కోట్ల నగదు ఉందంటూ ఓ సూట్‌కేస్ ఇచ్చి, ప్రతిగా హనుమంతరెడ్డి వద్ద ఉన్న రూ.36 లక్షలు తీసుకుని ఉడాయించాడు. తీరా సూట్‌కేస్ తెరిచి చూడగా అందులో చిన్నపిల్లలు ఆడుకునే డమ్మీ నోట్లు ఉండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

News March 25, 2026

సూర్యాపేటలో కొత్త నియోజకవర్గ చర్చ!

image

నియోజకవర్గాల పునర్విభజనపై జిల్లాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. పునర్విభజన జరిగితే సూర్యాపేటను రెండుగా విభజించే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. సూర్యాపేట టౌన్, రూరల్ మండలాలను కలిపి ‘సూర్యాపేట అర్బన్’ నియోజకవర్గంగా.. ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్పహాడ్‌తో పాటు కోదాడలోని మోతె మండలాన్ని కలిపి ‘సూర్యాపేట రూరల్’ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.

News March 25, 2026

గత 12 ఏళ్లలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ బడ్జెట్ వివరాలివే!

image

గత 12 ఏళ్లలో GWMC బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి.
➡2015-2016 రూ.541.33 కోట్లు, 2016-17 రూ.503.04కోట్లు
➡2017-18 రూ.1,043కోట్లు, 2018-19 రూ.1,123.97 కోట్లు
➡2019-20 రూ.1431.31 కోట్లు, 2020-21 రూ.305.06కోట్లు
➡2021-22 రూ.559.77కోట్లు, 2022-23 రూ.609.47కోట్లు
➡2023-24 రూ.612.29కోట్లు, 2024-25 రూ.650.12కోట్లు
➡2025-26 రూ.1,071.48కోట్లు, 2026-27 రూ.1,039.83కోట్లు