News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
ఆగిన ఎగుమతులు.. కుప్పకూలిన అరటి ధరలు

AP: పశ్చిమాసియాలో యుద్ధంతో అరటి రైతులు కుదేలవుతున్నారు. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోవడంతో 2 వారాల్లోనే వారి జీవితాలు తలకిందులయ్యాయి. ఈ నెల ఆరంభంలో టన్ను ధర రూ.20-23వేలు ఉండగా ప్రస్తుతం రూ.6-8వేలకు పడిపోయింది. స్థానికంగానూ కొనడానికి వ్యాపారులు ముందుకు రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. వార్ ఇలాగే కొనసాగితే రేట్లు మరింత పతనమవుతాయని అంచనా. రాయలసీమలో దాదాపు లక్ష ఎకరాల్లో అరటి సాగవుతుంది.
News March 16, 2026
మన్యం: ఇప్ప పువ్వు.. ఆదివాసీలకు ఆదాయ వనరు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివాసీ గ్రామాల్లో ఇప్ప పువ్వుల సేకరణ జోరుగా సాగుతోంది. అడవుల్లో లభించే ఈ పువ్వులను గ్రామస్థులు ఫిబ్రవరి నుంచి మే నెలవరకు సేకరించి ఎండ బెట్టి అమ్ముతుంటారు. ఈ పువ్వుల పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తుంటారు. ఈ ఇప్ప పువ్వును ఆదివాసీ గ్రామాల్లో ముఖ్యమైన ఆదాయ వనరులుగా భావిస్తారు.
News March 16, 2026
ఆస్కార్-2026 విజేతలు..

*ఉత్తమ సహాయ నటి – ఎమీ మ్యాడిగన్(వెపన్స్)
*బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – కెపాప్ డిమోన్ హంటర్స్ (మ్యాగీ కాంగ్, క్రిస్ అపెల్హాన్స్, మిషెల్లీ వాంగ్)
*బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – ది గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్(క్రిస్ లావిస్, మసీక్ జెజెర్బోవ్‌స్కీ)
*బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – కేట్ హాలే(ఫ్రాంకెన్‌స్టైన్)
*మేకప్ & హెయిర్ స్టైల్ – మైక్ హిల్, జోర్డాన్ శామ్యూల్, క్లియోనా ఫ్యురే (ఫ్రాంకెన్‌స్టైన్)


