News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 20, 2026

నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్: గణబాబు

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిధి నక్కపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలర్ మిట్టల్ – నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు మార్చి 23న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దీనివల్ల దాదాపు 55,000 మందికి ఉపాధి లభిస్తుందని విప్ గణబాబు వెల్లడించారు. 2029 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా, 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. దీంతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక హబ్‌గా మారనుందని ఆయన తెలిపారు.

News March 20, 2026

జనగామ జిల్లాలో పేపర్‌లెస్ పరిపాలనకు శ్రీకారం

image

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ-ఆఫీస్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రజాపాలనలో పారదర్శకత పెంపుతో పాటు సేవలను వేగవంతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉందన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్‌తో కలిసి ఈ-ఆఫీస్ వ్యవస్థను ప్రారంభించారు. ఫైళ్లను ఆన్‌లైన్‌లో నిర్వహించడం ద్వారా నిర్ణయాలు త్వరగా తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

News March 20, 2026

ఏప్రిల్ 2న టెన్త్ ఇంగ్లిష్ పరీక్ష: విశాఖ డీఈవో

image

మార్చి 21న ప్రభుత్వం రంజాన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఆరోజు జరగాల్సిన టెన్త్ పరీక్షను వాయిదా వేసినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అంశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలని ఆయన కోరారు.